
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు
1 గంటల క్రితం
హైదరాబాద్ : రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ సహా పలువురు బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం భేటీ అయ్యారు. ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే అంశాలపై వారితో కవిత చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటిసారి అని.. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలకు బంజారా సమాజానికి సముచిత అవకాశాలు ఇస్తామని కవిత హామీ ఇచ్చారు. తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు.. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి తాము ఏర్పాటు చేయబోయే పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.